Airtel & X: స్పేస్ ఎక్స్ తో ఎయిర్ టెల్ ఒప్పందం..! 1 y ago
భారత్ లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో వినియోగదారులకు స్టార్‌లింక్ హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు లభ్యం కానున్నాయని తెలిపింది. కాగా స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేసన్ సేవలకు కేంద్రం అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. అప్పుడే ఈ సేవలను భారత్ లో.. ఇవ్వడానికి వీలుంటుందని ఎయిర్ టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ తెలిపారు.